AP and TS / Entertainment
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మూవీ రివ్యూ
283 days ago

పాటల లిరిక్స్ మాత్రమేకాదు.. చివరకు బుల్లితెర షోల పేరు మీద కూడా సినిమాలు వస్తున్నాయి. ఈ కోవకి చెందినదే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మూవీ. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న సత్తిబాబు డైరెక్షన్‌లో శుక్రవారం థియేటర్స్‌కి వచ్చింది ఈ మూవీ. నవీన్ చంద్ర- శృతిసోథీ-సలోనిలు కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో కామెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ లీడ్‌రోల్లో నటించాడు. ఈ నేపథ్యంలో కోటీశ్వరుడు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడా? లేదా అనేది రివ్యూలో చూద్దాం. 


స్టోరీ.. తొలిసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కమెడియన్ పృథ్వీకి ఈ మూవీ హిట్ ఇస్తుందా? డైరెక్టర్ సత్తిబాబు కామెడీ ఫార్ములాతో ఆకట్టుకున్నాడా? స్టోరీలోకి వెళ్తే...  రైతు (చ‌ల‌ప‌తిరావు) కొడుకు ప్రశాంత్ (న‌వీన్ చంద్ర‌). అనుకోని ప‌రిస్థితుల్లో బిజినెస్‌మేన్ ఏబీఆర్ (ముర‌ళీ శ‌ర్మ‌) కుమార్తె ప్రియ (శ్రుతిసోధి)ని క‌లుసుకుంటాడు ప్రశాంత్. కొన్ని కారణాల వల్ల ప్రశాంత్‌ని లవ్ చేయడం మొద‌లుపెడుతుంది. ఐతే, తమ మధ్య అంత‌స్తుల తేడాను తెలుసుకున్న హీరో, ఆమెకు దూరంగా ఉండాల‌ని అనుకుంటాడు. ఈలోగా ఆమె రిక్వెస్ట్‌తో త‌న ఇంటికి తీసుకెళ్తాడు. కోటీశ్వరుల కూతురు త‌న ఇంట్లో అంద‌రితో సరదాగా ఉండ‌టం చూసి మ‌న‌సు ప‌డ‌తాడు. ప్రశాంత్ - ప్రియ ప్రేమకి నో చెబుతాడు బిజినెస్‌మేన్ ఏబీఆర్. ఇటు వ్యాపారవేత్త.. అటు ప్రశాంత్‌ల మాటల యుద్ధంలో చిన్న పోటీ జరుగుతుంది. ఈ ప్రయత్నంలోనే 30 ఇయ‌ర్స్ పృథ్వీని పెట్టి ‘త‌మ‌ల‌పాకు’ అనే సినిమాను చేస్తాడు ఏబీఆర్‌. అందులో మ‌హేశ్ (పృథ్వి), స‌మంత (స‌లోని) హీరోయిన్లు. దీనికి నిర్మాత తాతారావు(పోసాని కృష్ణ‌ముర‌ళి), డైరెక్టర్ రోల్డ్ గోల్డ్ ర‌మేష్ (ర‌ఘుబాబు)లకు మంచి పేరు వ‌స్తుంది. ఈ క్రమంలో త‌న కూతురు లవ్ విష‌యంలో ఓ నిర్ణయం తీసుకుంటాడు ఏబీఆర్. కూతుర్ని.. ప్రశాంత్‌కి ఇచ్చి మ్యారేజ్ చేస్తాడా? లేదా? అన్నదే అసలు స్టోరీ. 

విశ్లేషణ...  రెండు కథలను ఓకే స్టోరీలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఇ సత్తిబాబు. అలాగే ఈ రెండింటినీ కనెక్ట్ చేసిన తీరు సూపర్. కామెడీ సినిమాలు తెరకెక్కించటంలో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు, పేరడీ కామెడీని బాగా డీల్ చేశాడు. పేరుకే నవీన్ చంద్ర హీరో.. కానీ అంతా కమెడియన్ పృథ్వీనే కనిపిస్తాడు. త‌న ల‌వ్‌ను నెగ్గించుకోవ‌డానికి నవీన్.. ల‌వ‌ర్ ఫాదర్‌కి పెట్టిన ప‌రీక్ష ఈ సినిమా. ఫ‌స్టాఫ్‌ హీరోయిన్‌- ధ‌న్‌రాజ్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగున్నాయి. తనకు బాగా అలవాటైన పేరడీతో ఆకట్టుకున్నాడు పృథ్వీ. కామెడీ టైమింగ్తోపాటు పంచ్ డైలాగ్స్తో అలరించాడు. మ‌హేష్‌బాబుగా ఆయ‌న న‌ట‌న ఓకే. సినిమాలు తీసి నష్టపోయిన ప్రొడ్యూసర్‌గా తాతారావు రోల్‌కి పోసాని కృష్ణమురళి పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. రఘుబాబు, పోసాని కాంబినేషన్లో వచ్చే సీన్స్ బాగున్నాయి. అలాగే పాత సినిమాలోని పాట‌లు, డైలాగులు వినియోగించే తీరు బావుంది. న‌వీన్‌చంద్ర‌, శ్రుతిసోధి త‌మ పాత్రల్లో బాగానే రాణించారు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, జయప్రకాష్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్లు తమ పరిధిమేరా ఆకట్టుకున్నారు. కొన్నిచోట్ల మూవీ సాగ‌దీసిన‌ట్టుగా ఉంది. సంతోషానికి, ఆనందానికి తేడా తెలుసుకోవ‌డానికి ఓ బిజినెస్‌మేన్ 10 కోట్లు న‌ష్టపోవ‌డానికి సిద్ధం కావడం అంత తేలిగ్గా మింగుడు ప‌డ‌దు. స్క్రీన్‌ప్లే కాసింత డల్‌గా వుంది. కాలేజీ సీన్స్ హీరోని లవ్ చేయడానికి హీరోయిన్ చేసే ప్రయ‌త్నాలు కొన్ని ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే థియేట‌ర్‌కి వెళ్లి సినిమా చూసి హాయిగా న‌వ్వుకోవచ్చు. 

 

 

 

Read Also

 
 
Related News
JournalistDiary