AP and TS / Entertainment
పృథ్వీ ప్రాబ్లమ్‌కు మెగా సొల్యూషన్?
284 days ago

చిరంజీవి ‘ఖైదీ నెం.150’ సినిమాలో నుంచి పృథ్వీ నటించిన కొన్ని సన్నివేశాలు తొలగించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పృథ్వీ సంక్రాంతి రోజు కన్నతల్లి చనిపోయినంత బాధగా ఉందంటూ వాపోయారు ఇది పాత సంగతి. అయితే, తాజాగా ఈ ఇష్యూ పై ఆ సినిమా డైరెక్టర్ వివి వినాయక్ వివరణ ఇచ్చారు. ఆ సన్నివేశాల్ని తొలగిస్తున్నట్టు పృథ్వీకి ఫోన్ చేసి చెప్పానని.. తర్వాత ఆయన చేసిన తల్లి చనిపోయినంత బాధగా ఉందనే కామెంట్లు విని తాను చాలా ఫీలయ్యానన్నారు.

అదే విషయాన్ని పేపర్లో చూసిన చిరంజీవిగారు కూడా చాలా ఫీలయ్యారని వినాయక్ చెప్పారు. వెంటనే చిరంజీవిగారు తనకు ఫోన్ చేసి పండగరోజు ఎవర్ని బాధపెట్టడం ఎందుకు, కేవలం నలభై నిమిషాల సీనే కదా, అదుంటే పోయేదేముంది మహా అయితే ఇంకాస్త నవ్వుకుంటాం కదా అన్నారని వినాయక్ వెల్లడించారు.  చిరంజీవి గారే స్వయంగా చెప్పడంతో పృథ్వీ చేసిన బిట్ ను సినిమాలో చేర్చామని వినాయక్ తెలిపారు. 


 

Read Also

 
Related News
JournalistDiary