Telangana / Politics
యాక్సిడెంట్‌లో మంత్రి తలసాని సేఫ్.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్పగాయాలు
9 days ago

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పెద్దప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు కీసర సమీపంలో ప్రమాదానికి గురైంది. శామీర్‌పేట్‌ నుంచి కీసరకు వెళ్తుండగా ఔటర్‌ రింగ్‌రోడ్డుపై మంత్రి వాహనాన్ని ఓ లారీ ఢీకొంది.

ఈ ఘటనలో తలసాని వాహనంలోవున్న మేడ్చల్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. మేడ్చల్ కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేసి కీసర వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనాస్థలికి పోలీసులు, అధికారులు చేరుకొని పరిశీలించారు.

 

Read Also

 
Related News
JournalistDiary