World / Health
క్యాన్సర్ కణాలను వధించే పుదీనా..
509 days ago

కూరలకు తిరుగులేని రుచిని ఇచ్చే పుదీనా ఆకులో క్యాన్సర్ ను నయం చేసే గుణాలున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. పుదీనా ఆకు తరుచూ వాడటం వల్ల పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ ను నిరోధించవచ్చని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ అండ్  కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్  అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ (CIMAP AND CISR )లకు చెందిన సైంటిస్టులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం  రుజువైందట. దీనికి సంబంధించి ఎనిమిది మంది సభ్యులతో కూడిన సైంటిస్టుల బృందం సమర్పించిన  స్టడీస్ ను ఇంటెగ్రేటివ్ బయాలజీ జర్నల్ ఒమిక్స్ లో  ప్రచురించారు.

పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ కారక కణాలను పుదీనా లో ఉండే ఎల్ మెంథాల్ అనే పదార్ధం నాశనం చేస్తుందని స్టడీ లో పేర్కొన్నారు. క్యాన్సర్ కారక కణ విభజన జరగకుండా ఆపడంతో బాటు,  క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు సోకకుండా ఎల్ మెంథాల్  నిరోధిస్తుందని తేల్చారు. సో.. ఇప్పటిదాకా కాస్మొటిక్స్, ఫుడ్ లో మాత్రమే వాడుతున్న పుదీనా తో క్యాన్సర్  సైతం దూరం అవుతుందంటే గుడ్ న్యూసే కదా.. 

 
 
Related News