India / Politics
మోదీ చేతిలో 'జోకర్' ముక్క !
56 days ago

ప్రతీ సంక్షేమ పథకం నుంచి ఎంతోకొంత రాజకీయ లబ్ది పొందాలనుకోవడం ఏ అధికార పార్టీకైనా వుండే సహజ లక్షణం. చిన్నదైనా, పెద్దదైనా ప్రాజెక్ట్ నామకరణం దగ్గర నుంచే 'పిండుకోవడం' మొదలైపోతుంది. పదికాలాల పాటు నిలబడిపోతాయ్ కనుక.. పథకాల పేర్ల మీద పెద్ద కసరత్తు జరగడం కామన్. ఇందిర, రాజీవ్ పేర్లు తప్ప మరో సౌండే చెయ్యని కాంగ్రెస్ పార్టీ మీదయితే ఈ విషయంలో ఒక రచ్చే జరిగింది. కట్ చేస్తే.. ఇవ్వాళ మోదీ శకం షురూ ఐంది. 

 

నేను రిబ్బన్ కటింగుల కోసం రాలేదు అంటూ.. వ్యక్తిగత ప్రాపకం విషయంలో 'చేంజ్' చూపించబోయారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ మేరకు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు కూడా. అయితే.. యూ టూ బ్రూటస్.. అంటూ మోదీ మీద కూడా ఇప్పుడు తుంపర్లు పడిపోతున్నాయి.  'భీమ్' యాప్ విషయంలో మోదీ ప్లే చేసిన దళిత్ కార్డు గురించే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. 

 

 

నగదు రహిత లావాదేవీల కోసం.. దేశంలోని అన్ని బ్యాంకులనూ అనుసంధానం చేస్తూ 'భీమ్' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ప్రవేశపెట్టింది. ప్రధాని మోదీ చేతుల మీదుగానే ఇది ప్రారంభమైంది. రాజ్యాంగ సృష్టికర్త, భారత రత్న డాక్టర్ 'భీమ్' రావ్ అంబేద్కర్ పేరుమీదనే ఈ సదుపాయం అమలవుతుందని.. దళిత జనోద్ధరణకు ఎంతో పాటుపడుతుందని కూడా మోదీ సెలవిచ్చారు. 

 

అయితే .. భీమ్ అనగానే సహజంగా గుర్తుకొచ్చేవి మహా భారతం.. హిందూయిజం మాత్రమే. భీమ్ అనే రెండక్షరాలు అంబేద్కర్ స్మారకం అయ్యే చాన్సయితే లేదు. బాబాసాహెబ్ అనీ, కనీసం భీం రావ్ అనీ పిలిస్తే తప్ప అంబేద్కర్ పేరు స్పురణకు రాదు. మరి.. దీన్ని అడ్వాంటేజ్ 'దళిత్' అంటూ దళిత్ ఓటుబ్యాంకు మీదకు గాలం వెయ్యడం ఏమిటో ? 

 

 
 
 
Related News

JournalistDiary