AP and TS / Politics
యూపీ మాదే.. ఇదే రుజువు..
288 days ago

ఉత్తరప్రదేశ్ అధికార పార్టీ అల్లాడిపోతుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఫుల్ జోష్ లో వున్నారు. లక్నోలో జరిగిన పరివర్తన్ ర్యాలీ తర్వాత బహిరంగసభలో మాట్లాడిన మోదీ.. యూపీ మాదేనండానికి ఈ జనసంద్రమే సాక్ష్యమన్నారు. తాను ప్రధాని కాకముందు కూడా దేశవ్యాప్త ప్రచారంలో ఎక్కడా ఇటువంటి స్పందన చూడలేదని.. పద్నాలుగేళ్ల యూపీ 'కరువు' ఇక తీరిపోయినట్లేనని చెప్పుకొచ్చారు.

 

లక్నో అటల్ జీ సొంత ఇల్లులాంటిదని, అటల్ లాంటి ఉన్నత వ్యక్తులు ఎందరో తిరిగిన నేల అని స్థానిక ఓటర్ల మీద మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీతో పాటు హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్,  బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా లక్నో ర్యాలీలో పాల్గొన్నారు. ఒకవైపు రూలింగ్ సమాజ్ వాదీ పార్టీ చీలికలు-పేలికలై అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతుంటే.. బీజేపీ శ్రేణుల్లో మాత్రం మోదీ కొత్త మెరుపులు కురిపిస్తున్నారు. 

 

Read Also

 
Related News
JournalistDiary