India / Sports
అజారుద్దీన్‌కి రెండు బౌన్సర్లు!
76 days ago

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టైలిష్ బ్యాట్స్‌మ‌న్ మ‌హ్మద్ అజారుద్దీన్ బరిలోకి దిగారు. అజ‌ర్ ఎంట్రీతో హెచ్‌సీఏ ఎన్నిక‌లు హాట్‌హాట్‌గా మారాయి. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్ష ప‌ద‌వికి ఆయన మంగ‌ళ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశాడు. తాను మ‌ళ్లీ క్రికెట్ జీవితాన్ని మొద‌లుపెట్టాల‌ని భావిస్తున్నట్లు చెప్పిన అజ‌ర్, ఇకపై అసోసియేష‌న్‌లో క్రికెట్‌కే ప్రాధాన్యత‌ ఇస్తానని హామీ ఇచ్చాడు. హెచ్‌సీఏను ప్రక్షాళ‌న చేయ‌డానికే తాను బ‌రిలోకి దిగుతున్నాన‌ని ఇప్పటికే ఆయన ప్రక‌టించాడు.

మరోవైపు లోధా కమిటీ నివేదిక ప్రకారం అజార్ నామినేషన్ చెల్లుతుందా? అన్నదే ఆయన ప్రత్యర్థులు ఆరా తీస్తున్న పాయింట్. రాజకీయ నాయకులను క్రీడలకు దూరంగా ఉంచాలని ఆ కమిటీ గతంలో చెప్పింది. తొలుత స్టార్ క్రికెటరే అయినప్పటికీ ఆ తర్వాత అజారుద్దీన్ పొలిటికల్ అరంగ్రేటం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున యూపీలో పోటీ చేసి ఎంపీగా గెలుపొందాడు. చాన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగావుంటున్న అజారుద్దీన్, ప్రస్తుతమైన రాజకీయాలకు దగ్గరగా వుంటున్నాడు. ఒకప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో వార్తల్లోకెక్కిన అజార్‌కు ఆ ఫ్లాష్‌బ్యాక్ కూడా అడ్డంపడవచ్చని చెప్పుకుంటున్నారు. ఐనా, హెచ్ సీఏ ఎలక్షన్‌లో ఎప్పుడూ డబ్బు, పాలిటిక్స్ మాత్రమే మాట్లాడతాయి. అవినీతి గట్రా అక్కడ చెల్లుబాటు అవ్వవని కూడా తెలుసు. మరి అజార్ భవిష్యత్‌లో ‘క్రికెట్ పాలిటిక్స్’ రోల్ ఎంతన్నది చూడాలి. 

 

 
 
 
Related News

JournalistDiary