India / Politics
మోదీ మరో ప్రయోగం
123 days ago

ఉత్తరప్రదేశ్ తరహాలో ప్రధాని నరేంద్రమోదీ మరో ప్రయోగానికి తెరతీశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎక్కడా సోదిలో లేని పేరుని తెరమీదకి తెచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ ను అనూహ్యంగా సీన్ లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించడం ఒక్కసారిగా యావత్ దేశం ఆశ్చర్యానికి లోనైంది. ఈ పదవికి దాదాపు మూడునెలలుగా లాబీయింగ్ మొదలైంది. ఎన్డీయే అభ్యర్థిగా వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ నుంచి ఈనాడు అధినేత రామోజీ రావు దాకా పేర్లు వినిపించాయి. అయితే అకస్మాత్తుగా రామ్‌నాథ్ ని ప్రకటించడం ముమ్మాటికీ రబ్బర్ స్టాంప్ పాలిటిక్సే అన్న కామెంట్లు మొదలైపోయాయి.

పూర్తిగా తమ చెప్పుచేతల్లో ఉండే వ్యక్తినే మోదీ, అమిత్ షా ఫైనల్ చేశారంటూ రాజకీయవర్గాల్లో వ్యాఖ్యానాలు షరూ అయ్యాయి.  ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలోనూ ఇదే తరహా సస్పెన్స్ ను బీజేపీ కొనసాగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో యూపీ సీఎం కేండిడేట్ అంటూ రాజ్ నాథ్ సింగ్ నుంచి కళ్యాణ్ సింగ్ దాకా మాట్లాడుకున్నారు. ప్రమాణ స్వీకారం జరిగే కొన్ని గంటల ముందు యోగీని ప్రకటించి యూపీ ముఖ్యమంత్రిని చేసేశారు నరేంద్రమోదీ. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. 

 

Read Also

 
Related News
JournalistDiary