Telangana / Crime
సాంబారు ఘటన.. టీ. చీఫ్ సెక్రటరీకి నోటీస్
295 days ago

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ -‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. సాంబారు పాత్రలోపడి బాలుడి మరణించిన ఘటనపై ఆరువారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈనెల 23న నల్గొండ జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాలబాలికలకు వడ్డిస్తున్న సమయంలో వేడి సాంబారు పాత్రలో ఈదులూరు గ్రామానికి చెందిన ఐదేళ్ల జయవర్థన్‌ అనే బాలుడు పడిపోయాడు.

80శాతం కాలిపోయిన బాలుడ్ని వెంటనే ట్రీట్‌మెంట్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 24న మరణించాడు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. దీనిపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

 

Read Also

 
Related News
JournalistDiary