AP and TS / Entertainment
జనవరి నుంచి ఎన్టీఆర్ బయోపిక్ -తేజ
9 days ago

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా డైరెక్టర్ తేజకు మంచి ఉత్సాహాన్నే ఇస్తోంది. కొత్తప్రాజెక్ట్‌లు ఎప్పుడెప్పుడు చేద్దామా అనే క్యూరియాసిటీ అతనిలో కనిపిస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించబోతోన్న తేజ ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలవుతుందని చెప్పాడు.

ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటించబోతోన్న ఈ సినిమాకు మిగతా తారాగణం ఎంపిక చేయాల్సి ఉంది. ఇక, విక్టరీ వెంకటేష్ తో కూడా తేజ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో వెంకీ ప్రొఫెసర్ గా కనిపిస్తాడని తెలిపారు తేజ. అటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలు కొంచెం అటూ ఇటూ గా ఒకే టైమ్ లో రిలీజ్ కావడం ఖాయమేమో చూడాలి.

 

Read Also

 
Related News
JournalistDiary