AP and TS / Politics
మోదీ బొమ్మ పీకేయ్యండి !
256 days ago

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సీజన్ మొదలైందో లేదో.. ఆయా ప్రభుత్వాలకు కింద తడిసిపోవడం కూడా షురూ ఐంది. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే కోడ్ అఫ్ కండక్ట్ అమల్లోకొచ్చేసింది. నిబంధనావళిని భంగపరిచే ఎటువంటి చర్యల మీదైనా కత్తెర పడ్డం ఖాయం. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎలక్షన్ కమిషన్ ను కలిసి కొన్ని కోర్కెలతో ఒక చిట్టాని చేతుల్లో పెట్టి వచ్చారు.

మరుసటిరోజే ఈసీ కొరడా తిరగేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫొటోలున్న హోర్డింగ్స్ ను ఉన్న పళంగా తీసెయ్యాలన్నది ఈసీ తాజా ఆర్డర్. దేశంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద కేంద్ర ప్రభుత్వ పధకాలకు సంబంధించిన హోర్డింగ్స్ వున్నాయి. వాటి మీద మోదీ ఫోటో కూడా తప్పనిసరి ఉంటుంది. ఈ లెక్కన మోదీ కటౌట్స్ అన్నిటికీ మూడినట్లే మరి. 

 
 
 
Related News
JournalistDiary