India / Entertainment
నయన్ డిమాండ్ చేసింది 30 లక్షలా?
17 days ago

గోపీచంద్ - నయనతార జంటగా రానున్న సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’. విడుదలకు సమయం దగ్గర  పడుతుండడం‌తో ప్రమోషన్ మొదలైంది. వక్కంతం వంశీ స్టోరీ ఇచ్చిన ఈ ఫిల్మ్ ఎప్పుడో మొదలైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల లేట్‌గా రిలీజ్ అవుతోంది. దీంతో ప్రమోషన్ చేయడానికి రావాల్సిందిగా అడిగిన ప్రొడ్యూసర్‌కి షాక్ ఇచ్చిందట నయనతార.

 

ప్రమోషన్‌కి వస్తానని, ఇంటర్వ్యూలు కూడా ఇస్తానని కాకపోతే 30 లక్షలు రెడీ చేసుకోండి అంటూ రిప్లై ఇచ్చిందట ఈ బ్యూటీ. ఒక్కసారిగా షాకైన నిర్మాతలు అంత ఇవ్వలేనని రిక్వెస్ట్ చేశారట. చివరకు చేసేది లేక నయన్ లేకుండానే ప్రమోషన్ చేయాలని డిసైడ్ అయ్యాడట ప్రొడ్యూసర్.

 

 
 
 
Related News

JournalistDiary