World / Health
‘హెపటైటిస్ సీ’ చికిత్సకు కొత్త మందులు
668 days ago

ప్రాణాంతకంగా మారుతున్న హెపటైటిస్ బీ, సీ వ్యాధులపై  ఢిల్లీలో జరిగిన సదస్సులో నిపుణులు  సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా హెపటైటిస్ సీ చికిత్సకు సంబంధించి రెండు కొత్త మందులను కనుక్కున్నారు. వీటి వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, పైగా 90 శాతం క్యూర్ చేయవచ్చునని వారంటున్నారు. విదేశాల్లోని మందులకన్నా ఇవి చాలా చౌక అని పేర్కొన్నారు. హెపటైటిస్ బీ వ్యాధి అతి ప్రమాదకరమైన వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు .ఈ జబ్బుకు సుమారు 24 కోట్లమంది గురవుతున్నారని అంచనా. పైగా లివర్ క్యాన్సర్ తో కూడిన ఈ జబ్బు వల్ల  ప్రతి ఏడాదీ సుమారు 8 లక్షలమంది మరణిస్తున్నారని , హెపటైటిస్ బీ తో బాటు సీ వ్యాధికి ఎనిమిదివేలమంది గురవుతున్నారని లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ శివ్ సరీన్ తెలిపారు.

ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చునన్న ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సకాలంలో సరైన ట్రీట్ మెంట్ తీసుకుంటే ఈ వ్యాధులను అదుపు చేయవచ్చునని చెప్పారు. అటు-ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా రెండు కొత్త మందులను లాంచ్ చేశారు. సైలెంట్ కిల్లర్ అయిన హెపటైటిస్ సీ సాధారణంగా 20 లేదా 25 ఏళ్ళ తర్వాత సోకుతుందని దీని చికిత్స లో  ఈ మందులు మంచి ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు. హెపటైటిస్ రోగుల్లో చాలామంది ప్రతివారం ఇంజెక్షన్లు తీసుకుని సైడ్‌ఎఫెక్ట్స్ బారిన పడుతుంటారని, ఐతే నోటిద్వారా తీసుకునే యాంటీవైరల్ డ్రగ్‌తోపాటు ఈ మందులు కూడా తీసుకుంటే త్వరగా కోలుకుని ఆరోగ్యవంతులవుతారని నిపుణులు సూచిస్తున్నారు. 

 

Read Also

 
Related News
JournalistDiary