AP and TS / Entertainment
బాలయ్య సక్సెస్‌‌‌లో నితిన్ వాటా ఎంత ?
10 days ago

హీరోగా, ప్రొడ్యూసర్‌‌గా, డిస్ట్రిబ్యూటర్‌‌గా టాలీవుడ్‌‌లో ట్రిపుల్ రోల్ పోషిస్తున్న నితిన్‌‌కు ఎట్టకేలకు మంచి బ్రేక్ వచ్చేసింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న శాతకర్ణి మూవీతో లాభపడే వ్యక్తుల్లో నితిన్ కూడా ఒకరు. ఎలాగంటే.. భీకరమైన పోటీని తట్టుకుని బాలయ్య సినిమా నైజాం హక్కుల్ని కొనేసుకుంది ఈ కుర్ర హీరోనే.

ఎన్ని కోట్లకు కొన్నాడన్న లెక్కలైతే టూ కాన్ఫిడెన్షియల్. రేపటిరోజున బాలయ్య వందో సినిమా సక్సెస్ నుంచి నితిన్‌‌కి మిగలబోయే షేర్ ఎంతన్నది కూడా ఇప్పుడే లెక్క కట్టలేం. ఏదైతేనేం.. అఖిల్ డెబ్యూ మూవీ ప్రొడ్యూసర్‌‌గా 20 కోట్లు (?) పోగొట్టుకున్న నితిన్ కి బాలయ్య నుంచి గొప్ప రిలీఫ్ దొరికినట్లే. 

 
 
 
Related News

JournalistDiary