AP and TS / Entertainment
బన్నీ పక్కన నివేదాకి చోటు!
122 days ago

అల్లుఅర్జున్- వక్కంతం వంశీ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ ‘నా పేరు సూర్య’. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోయే ఈ మూవీలో మిలటరీ అఫీసర్ సూర్యగా బన్నీ కనబడతాడని సమాచారం. ఐతే, హీరోయిన్ ఎవరైతే బాగుంటుందనే ఆలోచనలో బన్నీ క్యాంప్ నిమగ్నమైంది.

ఇప్పుడున్న హీరోయిన్లతో నటించడంతో కొత్తబ్యూటీ అయితే బాగుంటుందని భావిస్తోంది యూనిట్. ఈ క్రమంలో నివేదా థామస్‌ని సంప్రదించడం, ఓకే చేసినట్టు ఓ ఫీలర్ బయటకువచ్చింది. లగడపాటి శ్రీధర్‌తో నాగబాబు కలసి ఈ ప్రాజెక్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మంచి పెర్ఫార్మర్‌గా పేరున్న నివేదా, తెలుగులో బిజీగా మారుతోంది. జై లవకుశ, నిన్ను కోరి లాంటి క్రేజీ ప్రాజెక్టు చేస్తోంది. ఇప్పుడు బన్నీ సినిమాలోనూ ఆఫర్ రావడంతో నివేద టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోవడం ఖాయమని ఆమె హార్డ్‌‌కోర్ ఫ్యాన్స్.

 

Read Also

 
Related News
JournalistDiary