World / Health
దంతసిరికి వజ్ర వైద్యం
667 days ago

గట్టిదనంతో పోల్చాలంటే వజ్రంతోనే పోలుస్తారు. అందుకేనేమో .. మిలమిల మెరిసే వజ్రపు తునకలను రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్‌లో వాడనున్నారట. వెంట్రులో వెయ్యో వంతు మందంలో వజ్రాలను దంత వైద్యంలో వాడుతున్నారు. దీంతోపాటు క్యాన్సర్ థెరపీ, ఇమేజింగ్.. మానవ శరీర భాగాల పునరుత్పత్తికి సంబంధించిన వైద్యంలో కూడా నానో డైమండ్స్ ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన దంతాలకు పడ్డ గుంటలను ‘గుట్టా పెర్చా’ అనే గట్టి  పదార్ధంతో ఫిల్ చేస్తారు. ఐతే, ఒక్కోసారి చేసిన రూట్ ఫిల్లింగ్ కూడా ఫెయిల్ అవుతుంటాయనీ, అలాకాకుండా ఉండేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా- లాస్ఏంజెల్స్ స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీ రీసెర్చర్లు కలిసి నానో డైమండ్స్ ఉపయోగించి గుట్టా పెర్చా కంటే మెరుగ్గా ఉండేలా రూట్ ఫిల్లింగ్ చేయవచ్చని కనుగొన్నారు. నానో డైమండ్స్‌తో‌పాటు  ఎమాక్సిలిన్ కలిపి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్  చేస్తే బాక్టీరియా పూర్తిగా నివారించవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.

 


 
 
Related News