AP and TS / Entertainment
బిగ్‌బాస్‌లో మిస్సయ్యింది అదే!
69 days ago

బుల్లితెరపై ఎన్టీఆర్ షో బిగ్‌బాస్ హవా రోజురోజుకూ తగ్గుతోందా? రేటింగ్స్, ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే ఇవే డౌట్స్ వస్తున్నాయని స్మాల్ స్క్రీన్ టాక్. శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రమే కాసేపైనా చూస్తున్నామని కొందరంటున్నారు. ఇప్పటికి దాదాపు నాలుగు వారాలు పూర్తిచేసుకున్న ఈ షో, మిగతా వారాల్లో ఎలాంటి హడావిడి, కాంట్రవర్సీ లేకుండా చప్పగా సాగడానికి కారణాలున్నాయని అంటున్నారు. పార్టిసిపెంట్స్‌లో ఇప్పటివరకూ ఎవరూ ఆశించిన రేంజ్‌లో ఆడియన్స్ ను మెప్పించపోవడం, తమ టాలెంట్‌కు తగ్గ ఆటపాటలు కనబరచకపోవడం వంటివి కారణాలుగా చెబుతున్నారు.

ఆడియన్స్‌కు అంతగా తెలియని ముగ్గురు పార్టిసిపెంట్స్ ఈ షోలో కొనసాగడంతో రిమోట్ అవసరం వస్తోందని రెగ్యులర్ ఫాలోయర్స్ అంటున్నారు. ఈ వీకెండ్‌లో మరో ఇద్దరి ఎలిమినేషన్స్, ఆ ప్లేస్‌లో ఓ గ్లామర్ హీరోయిన్, ఫేమస్ యాంకర్ ఎంట్రీ ఇచ్చి షోకు జోష్ తెస్తారని టాక్. తాజా రేటింగ్స్ పరిశీలిస్తే వరుసగా మూడువారాలు వీకెండ్స్ 10.69, 8.9, 7.06.. వీక్ డేస్ 6.94, 6. 32, 5. 45 వస్తే జబర్దస్త్‌కు కూడా యావరేజ్‌గా 7 రేటింగ్స్ కాగా, స్వాతిచినుకులు, కుంకుమపువ్వు సీరియల్స్ 10 పైగా రేటింగ్స్ సాధిస్తూ సీరియల్స్ టాప్‌లో ఉన్నాయి.

 

Read Also

 
Related News
JournalistDiary