India / Crime
ఓంపురి చనిపోయే ముందు..
286 days ago

బాలీవుడ్ నటుడు ఓంపురి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టంలో ఆయనకు తలవెనుక గాయం కనిపించింది. దీంతో చనిపోక ముందు ఆయన మద్యం తీసుకున్నట్లు భావిస్తున్నారు పోలీసులు. చివరిసారిగా ఓంపురి తన క్లోజ్‌ఫ్రెండ్‌తో మాట్లాడారని చెబుతున్నారు. ఓంపురి చనిపోడానికి ముందురోజు తన కొడుకు ఇషాన్‌ను కలుసుకోడానికి ప్రయత్నించారని ప్రొడ్యూసర్ ఖలీద్ కిద్వాయ్ చెబుతున్నమాట.

అనారోగ్యంతో బాధపడుతున్న ఇషాన్ ట్రీట్‌మెంట్ కోసం విదేశాల్లోని కొంతమందిని ఓంపురి సంప్రదించినట్లు సమాచారం. ఓంపురి మాజీ భార్య నందిత దగ్గర ఉంటున్నాడు ఇషాన్. ఓ విషయంపై నందితకు ఓంపురి ఫోన్‌చేసి త్వరగా రావాలంటూ చెప్పారని, ఆమె రాక ఆలస్యకావడంతో కారులోనే ఓంపురి మద్యం తీసుకున్నాడంటూ వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఆయన మృతిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

 

Read Also

 
Related News
JournalistDiary