World / Health
తియ్యని డ్రింక్‌లు చేటు గురూ!
436 days ago

షుగర్‌తో కూడిన డ్రింక్‌లు తాగడం వల్ల ఫ్యాట్ ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ ఈ డ్రింక్స్ తాగుతున్నవారిలో చాలామంది శారీరక రుగ్మతలు, గుండెజబ్బులు, ఓబెసిటీ బారినపడుతున్నారని తేల్చారు. తాగనివాళ్లకన్నా ఇలా వీటిని సేవిస్తున్నవారిలో 30శాతం రిస్క్ పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. ఈ డ్రింక్స్‌పై ఆరేళ్లపాటు స్టడీ చేసిన పరిశోధకులు... టైప్ 2 డయాబెటిస్‌కు కూడా ఇది కారణమవుతుందని పేర్కొంటున్నారు. 

ఆరేళ్లపాటు వెయ్యమంది నడివయసు గల వ్యక్తులపై పరీక్షలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తానికి స్వీట్ డ్రింక్స్.. ఆరోగ్యానికి హానికరమని తమ పరిశోధనల సంకలనాన్ని వ్యాసరూపంలో తీసుకొచ్చారు. దీంతో షుగర్‌తోకూడిన డ్రింక్ లపై పన్ను విధించాలన్న ఒత్తిడి బ్రిటీష్ ప్రభుత్వంపై పెరిగింది.

ఈ పరిశోధనల నేపథ్యంలో బ్రిటన్‌లోని శీతల పానీయాల ఉత్పత్తి సంస్థలు తమ డ్రింక్స్‌లో చక్కెర శాతాన్ని చాలావరకు తగ్గించేపనిలో పడ్డాయి. 2020 నాటికి కేలరీల శాతాన్ని ఇంకా తగ్గిస్తామని ప్రకటిస్తున్నాయి. 

 

 
 
 
Related News

JournalistDiary