Telangana / Crime
సెక్స్ రాకెట్‌లో బుల్లితెర నటి
64 days ago

ఓ సెక్స్ రాకెట్‌ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. టీవీ నటితోపాటు మరో యువతి, ఓ మేకప్‌మేన్ వున్నారు. యూసుఫ్‌గూడ మధురానగర్‌లోని ఓ వసతి గృహంలోవుంటూ టీవీ సీరియళ్లలో నటిస్తోంది 28 ఏళ్ల యువతి. అలాగే సైనిక్‌పురి ఆర్కేపురానికి చెందిన మరో 28 ఏళ్ల, యూసుఫ్‌గూడకు చెందిన మేకప్‌మెన్‌ బండారిలు ఓ ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్‌ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం వెళ్లింది.

 

రంగంలోకి దిగిన పోలీసులు, శనివారం ఈ ముగ్గురు కలిసి బోడుప్పల్‌ వద్దకు కారులో వచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న మల్కాజిగిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీం వీళ్లని అదుపులోకి తీసుకుంది. రూ. 1700 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 
 
Related News