India / General
జయ మృతి కేసు.. సీల్డ్ కవర్‌లో
42 days ago

జయలలిత మృతిపై ఫిబ్రవరి 23 లోగా వివరాలను సీల్డ్ కవర్‌లో వివరాలు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది చెన్నై హైకోర్టు. జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ సోమవారం విచార‌ణ‌కు వ‌చ్చింది. దీనిపై వాద‌న‌లు విన్న హైకోర్టు, సర్కార్‌కి నోటీసులు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాల ప‌ట్ల స్పందించిన ప్రభుత్వ త‌ర‌పు లాయర్.. జ‌య‌ల‌లిత‌కు అందించిన చికిత్సపై నివేదిక ఇవ్వడానికి సిద్ధమేన‌ని పేర్కొన్నారు. మరోవైపు జయకు నిర్వహించిన ట్రీట్‌మెంట్‌పై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధమని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

 
 
 
Related News

JournalistDiary