India / Entertainment
‘పద్మావతి’ భర్త హంగామా
25 days ago

బాలీవుడ్ ఫిల్మ్ ‘పద్మావతి’ హంగామా మొదలైంది. రెండురోజుల కిందటే దీపికా ఫస్ట్‌లుక్ రాగా, సోమవారం ఆమె భర్త మహారావల్ రతన్‌సింగ్ లుక్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాత్రలో షాహిద్‌‌కపూర్ నటిస్తున్నాడు. శరీరం నిండా గాయాలు న్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కాసింత కోపంగా కనిపించాడు. ఈ లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

 

ఇక అల్లావుద్దీన్‌ ఖిల్జి క్యారెక్టర్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఆయన లుక్ ఎలా వుంటుందోనన్న ఆసక్తి సినీ లవర్స్‌లో మొదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీ. అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ ఒకటిన దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది ఈ ఫిల్మ్.

 

Read Also

 
Related News
JournalistDiary