India / Entertainment
సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లజ్‌కి షాక్
10 days ago

సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్ బాధ్యతల నుంచి పహ్లజ్ నిహ్లానీని తప్పించింది కేంద్రం. ఆయన స్థానంలో గేయ రచయిత, కవి
ప్రసూన్ జోషి బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్ల కిందట సీబీఎఫ్‌సీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఉడ్తా
పంజాబ్‌తోపాటు అనేక సినిమాల్లో భారీ స్థాయిలో సన్నివేశాలను తొలగించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.


తాజాగా జబ్‌హారీ మెట్‌సెజాల్ ఫిల్మ్‌లో ఇంటర్‌కోర్స్ అనే పదాన్ని బీప్ చేయాలని సూచించడమే ఆయన్ని తప్పించడానికి
కారణమని అంటున్నారు. వాస్తవానికి నిహ్లానీ పదవీకాలం 2018 జనవరితో ముగియనుండగా, ఈలోగానే ప్రభుత్వం
ఆయనకు ఉద్వాసన పలికింది. నిహ్లానీ స్థానంలో సెన్సార్ బోర్డ్ చైర్‌పర్సన్‌గా ప్రసూన్ జోషి బాధ్యతలు తీసుకోనున్నారు. బెస్ట్
లిరిక్స్ విభాగంలో రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనకు 2015లో పద్మశ్రీ వరించింది.

 
 
Related News