AP and TS / Entertainment
‘పైసా వసూల్’ టీజర్
24 days ago

బాలకృష్ణ- శ్రేయ జంటగా రానున్న మూవీ ‘పైసా వసూల్’. ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ రిలీజైంది. దాదాపు నిమిషమున్నర నిడివిగల ఈ వీడియోలో బాలకృష్ణ‌ని డిఫరెంట్‌గా చూపించాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. మాఫియా నేపథ్యంలో రానున్న ఈ మూవీలో పోర్చుగల్‌ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. ‘అన్నా... రెండు బాల్కనీ టికెట్లు కావాలి.. ఇది సినిమా కాదు బే.. సినిమా కాకపోతే ఇంకేంటి?,
తమ్ముడూ.. నేను జంగిల్ బుక్ సినిమా చూడలేదు.. కానీ, అందులో పులి నాలాగే వుంటుందని చాలామంది చెప్పారు.. అది
నిజమో కాదో మీరే చెప్పాలి’ అన్న డైలాగ్స్ బాగున్నాయని అంటున్నారు. ఈ ఫిల్మ్ కోసం బాలయ్య స్లిమ్‌గా తయారయ్యాడని,
టైటిల్ సాంగ్ బాగుందని, ఇక డ్యాన్స్ కూడా వెరైటీ వుందని అంటున్నారు. మొత్తానికి టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. 

 
 
Related News