India / Politics
నోట్ల రద్దు.. ఆర్బీఐ గవర్నర్‌‌కు షాక్
14 days ago

ఆర్బీఐకి ఊహించని షాక్ తగిలింది. పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేయాల్సివచ్చిందో వివరణ ఇవ్వాలని కోరుతూ పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ- పీఏసీ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 28 ముందు హాజరై సమాధానం ఇవ్వాలని అందులో ప్రస్తావించింది. నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఆర్బీఐ పాత్ర ఏమిటి? దేశ ఆర్థికవ్యవస్థపై అది చూపిన ప్రభావం, రెండు నెలల్లో వచ్చిన మార్పు వంటి అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

 

సరైన ఆధారాలు ఇవ్వకుంటే ఇవ్వకుంటే అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టేనని తెలిపింది. ఈ క్రమంలో గవర్నర్ విధుల నుంచి ఎందుకు తొలగించరాదో స్పష్టంచేయాలని పేర్కొంది. రద్దు నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంకు తీసుకుందని, దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పిన మాటలు నిజమేనా? ఒకవేళ ఆర్బీఐ ఆలోచనే అయితే, నోట్లరద్దుపై ఎప్పుడు చర్చించారని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది. దీనికి ఆర్బీఐ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి. 

 
 
 
Related News

JournalistDiary