AP / Politics
‘పవర్’ పాయింట్ ప్రజెంటేషన్
226 days ago

నవ్యాంధ్రకు కేంద్రం చేసిన అన్యాయంపై పబ్లిక్ మీటింగులు పెట్టి చాలాసార్లు ప్రశ్నించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు దృష్టి సారించారు. ఇప్పటివరకు రాయలసీమ(తిరుపతి, అనంతపురం), కోస్తా (కాకినాడ)లో భారీ బహిరంగ సభలు పెట్టి కేంద్రంపై దుమ్మెత్తిపోసిన పవన్ ఈసారి సీన్ శ్రీకాకుళంకి మార్చారు.

ఉదయం 10 గంటలకు జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, సాయంత్రం 4 గంటలకు విశాఖకు రానున్నారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, తన అభిమానులతో సమావేశం తర్వాత 4న హైదరాబాద్‌కు రానున్నారు. పవన్ స్పీచ్‌లో పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా కేంద్రం ఇచ్చిన 1981 కోట్లను ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశముందని అంచనా వేస్తున్నాయి జనసేన వర్గాలు. 

 
 
Related News