AP / Politics
సమైక్యాంధ్ర కోసం నిరాహారదీక్ష..?
1185 days ago

పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటేనే ఒంట్లో ఏదో తెలియని ఉత్తేజం. ఆయనంటే అభిమానులకు యమ క్రేజ్. పవనిజం‌కున్న పవర్ అటువంటిది. అయితే కొన్నాళ్లుగా ఆయన రాజకీయాల్లోకి రానున్నాడన్న ఊహాగానాలు ఫిలింనగర్‌లో ఊపందుకున్నాయి. పవన్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అంటూ రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఎకౌంట్లో పదేపదే రాస్తున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వస్తే తాను కూడా ఆయనకే మద్దతిస్తానని వర్మ స్పష్టం చేశాడు. చూడబోతే పవన్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టేవరకు వర్మ ఆయన్ని విడిచిపెట్టేలా లేడు.

ఇక ఇదిలావుండగానే ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులపై పవన్ కొంత ఆవేదనతో వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... రాష్ట్రం సమైక్యంగా వుండటం కోసం గత పదిపన్నెండు రోజులుగా ఆయన తన ఇంట్లోనే నిరాహారదీక్ష చేస్తున్నాడన్న వార్తను ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. అయితే ఆయన నిరాహారదీక్షపై స్పష్టమైన సమాచారం మాత్రం ఏదీలేదు. ఈ విషయమై అటు ఆయన కూడా ఏమీ స్పందించలేదు. సమైక్యాంధ్ర కోసం పవన్ దీక్ష చేస్తున్నాడన్నది ఉత్తి పుకారే అని ఇంకొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పవన్ స్పందిస్తేకానీ అసలు విషయమేదో తెలిసిరాదేమో!!

 
 
 
Related News