AP and TS / Entertainment
ప్రభాస్ ‘సాహో’లో అదే పెండింగ్
9 days ago

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న స్టైలిష్ మూవీ ‘సాహో’. దీన్ని డిలే కాకుండా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయబోతున్నాడట డైరెక్టర్ సుజీత్. తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఒకేసారి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్ క్రియేట్ చేసి, బోలెడంత పబ్లిసిటీ తెచ్చేశాడు. ఇక డిలే చేయడం బాగుందని భావించిన సుజీత్, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆగష్టు 15 లోపు ఇస్తానని సమాచారం ఇస్తామంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ పక్కన నటించడానికి ఆసక్తి చూపిన ఈ సుందరి, వేరే కమిట్‌మెంట్స్ ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోతుందని టాక్. ఒకవేళ డేట్స్ ఎడ్జెస్ట్ అయితే హీరోయిన్‌గా శ్రద్ధా రావచ్చని, లేదంటే మరో హీరోయిన్ కోసం డైరెక్టర్ సెర్చింగ్ మొదలుపెట్టాల్సిందేనని అంటున్నారు. ఇక ప్రభాస్ కూడా రెగ్యులర్‌గా షూట్‌లో జాయిన్ అవుతున్నాడట. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చేఏడాది సమ్మర్‌కి రిలీజ్ చేసేలా యూనిట్ ప్లాన్ చేస్తోందట.

 
 
Related News