AP and TS / Entertainment
జోగేంద్ర.. జోగేంద్ర.. జగన్‌‌‌‌ను టార్గెట్ చేశావా?
67 days ago

ముఖ్యమంత్రి ప్రధాన పాత్రగా సినిమాలు తీయడం ఎన్నాళ్ళనుంచో నడుస్తున్న ఒక ట్రెండ్. సీఎం చుట్టూ తిరిగే పొలిటికల్ స్టోరీలు సక్సెస్ కొట్టిన సందర్భాలు కూడా ఎక్కువే. రానా హీరోగా, తేజ డైరెక్షన్ లో వచ్చిన 'నేనే రాజు-నేనే మంత్రి' కథా నేపథ్యం కూడా అటువంటిదే. శుక్రవారం విడుదలైన ఈ మూవీ క్లాస్, మాస్ ఆడియెన్స్ ని ఉమ్మడిగా ఆకట్టుకున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక.. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ విషయానికొస్తే.. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి సీఎం కుర్చీ దాకా ఎదిగే హీరో పాత్రలో రానా బాగా రాణించాడంటూ కాంప్లిమెంట్స్ పడిపోతున్నాయి.

 

ఇంతకుముందోసారి.. లీడర్ మూవీలో సీఎం పాత్రపోషించినప్పటికీ .. ఇందులో మాస్ టచ్ పొలిటీషియన్ గా వేరియేషన్ చూపించడంలో రానా పర్వాలేదనిపించాడు. కరెంట్ పొలిటికల్ ట్రెండ్ ని స్పృశిస్తూ రానాతో చెప్పించిన కొన్ని డైలాగులు సైతం సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ''ఇక గెలవడానికి మీరు పూజలు, యాగాలు చేసుకోండి..'', ''ఈ కన్నీటి యాత్రలు, బుగ్గలు గిల్లడాలు, ముద్దులు పెట్టడాలు వీడు బాగా అలవాటు చేసుకున్నాడు'' అంటూ రానా చెప్పిన డైలాగ్స్.. ఆడియెన్స్ లో చర్చకు చోటిచ్చేశాయి.

 

Read Also

 
Related News
JournalistDiary