AP and TS / Entertainment
ఆ రెండు డైలాగులే కత్తి !
108 days ago

ఖైదీ కోసం.. ఒరిజినల్ 'కత్తి' నుంచి కొన్ని డిలీషన్స్  తప్పలేదని చిరంజీవి ముందే చెప్పారు. రాజకీయాలను టచ్ చేస్తూ వున్న కొన్ని డైలాగుల జోలికి తాను వెళ్లనేలేదని రిలీజుకు ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు కూడా. అయితే ఖైదీ మూవీలో 'పొలిటికల్ పంచ్' మిస్సవుతుందని భావించిన ఫ్యాన్స్ కు చిన్న ఇక్కడో చిన్న రిలీఫ్. సినిమాలో సందర్భానుసారంగా.. చిరు పొలిటికల్ నేచర్ ని గుర్తు  చేస్తూ రెండు చోట్ల రెండు 'కత్తి' లాంటి డైలాగులు వినిపించాయి.

''అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి నాకు తెలీదు సర్‌', 'నవ్విన వాళ్లకి చెప్పు... ఏడ్చే రోజు త్వరలోనే వస్తుందని''  చిరంజీవి నోటి నుంచి ఈ మాటలు వినిపించగానే అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిల్లింది. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. భవిష్యత్తులో చిరంజీవి 'క్రియాశీలక పాత్ర' పోషిస్తారన్న అంచనాలకు ఈ డైలాగులు ఊతమిచ్చినట్లయింది. 

 

 

 
 
 
Related News

JournalistDiary