AP and TS / Entertainment
పూజా ఐటెమ్‌సాంగ్ చేస్తోంది అందుకేనా?
8 days ago

బెంగుళూరు బ్యూటీ పూజాహెగ్డేకి వున్న ఐరెన్ లెగ్ ముద్రను చెరిపేసింది దువ్వాడ జగన్నాథం మూవీ. అల్లుఅర్జున్ హీరోగా
వచ్చిన ‘డీజే’ పూజా కెరీర్‌కి ప్లస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే అందులో ఈ బ్యూటీ చేసిన గ్లామర్ షో బాగా హైలైట్
అయ్యింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా.. చెర్రీ- రంగస్థలంలోనూ ఛాన్స్
కొట్టేసింది. అందులో ఐటెం సాంగ్ చేయనుందని టాక్. చెరీ-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టులో ఐటెంసాంగ్
స్పెషలిస్ట్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేశాడని, త్వరలో చెర్రీ-పూజాల మీద పిక్చరైజ్ చేస్తారట. ఇన్‌సైడ్ టాక్
ప్రకారం.. కొరటాల శివతో చెర్రీ చేయనున్న న్యూమూవీలో హీరోయిన్‌గా పూజాకి ఆఫర్ వచ్చినందుకే ‘రంగస్థలం’లో ఐటెం
సాంగ్ చేస్తోందట.

 

Read Also

 
Related News
JournalistDiary