AP and TS / Entertainment
లక్ష్మీస్ ఎన్టీఆర్: అదంతా అబద్ధమన్న వర్మ
9 days ago

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో కీలకమైన ఎన్టీఆర్ రోల్‌ని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ సరిపోతాడని, ఆయనను దాదాపుగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఓకే చేసినట్టు వార్తలొచ్చాయి.

ఈ పాత్రకు ఆయనే న్యాయం చేయగలడని డైరెక్టర్ భావిస్తున్నట్లు ఓ రేంజ్‌లో ప్రచారం సాగింది. దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ ఫైనల్ చేయలేదని తెలిపాడు. త్వరలోనే డీటేల్స్ వెల్లడిస్తాడని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. మరోవైపు ఎన్టీఆర్ రోల్ ఎవరు చేయబోతున్నా రన్న ఆసక్తి సినీ లవర్స్‌లో మొదలైంది. 

 

Read Also

 
Related News
JournalistDiary