AP / Politics
వైసీపీకి ప్రశాంత్ గుడ్ బై?
69 days ago

వైసీపీ ప్రచార వ్యూహకర్తగా ఏపీ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ శకం క్లైమాక్స్‌లో పడిందా? జగన్ వ్యవహార
శైలితో విసిగిపోయిన ఆయన, తన ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టేశారా? ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి. జగన్ వ్యవహారశైలిని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా భరించలేక పోయాడని, అందుకే ఆయన ఢిల్లీ వెళ్లిపోయాడని కేఈ ఎద్దేవా చేశారు. దీనిపైనే పార్టీ లోపల బయటా చర్చ బలంగా వినిపిస్తోంది.

ప్లీనరీ వేదిక మీద అట్టహాసంగా ఎక్స్‌పోజైన ప్రశాంత్ కిషోర్, తనదైన స్కెచ్‌లతో జగన్ పార్టీలో స్పీడ్ పెంచినట్టు మొన్నటివరకు వార్తలొచ్చాయి. జగన్ కూడా పీకేతో బాగా అడ్జెస్ట్ అవుతున్నట్లు కూడా వైసీపీ కేడర్ చెప్పుకొచ్చింది. కానీ, నంద్యాల బైపోల్ ప్రచారం నేపథ్యంలో జగన్ మీద కొన్ని సీరియస్ రిమార్క్స్ వచ్చాయి. చంద్రబాబుకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ నెగిటివ్ క్యాంపెయిన్ చేయిస్తున్న విషయాన్ని ఇటీవల మీడియా బయటపెట్టింది. ఈశాన్య రాష్ర్టాల్లోని పాత ఫేక్ అకౌంట్ల ద్వారా టీడీపీకి వ్యతిరేకంగా సెటైర్లను రాయించి స్ప్రెడ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే! ఈ వరుస పరిణామాలతో ప్రశాంత్ కిషోర్‌ పునరాలోచనలో పడ్డారంటూ ఓ ఫీలర్ హంగామా చేస్తోంది.

 

Read Also

 
Related News
JournalistDiary