India / General
రెండు క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణ
6 days ago

నెలరోజుల్లో బాధ్యతల తప్పుకోనున్న రాష్ట్రపతి ప్రణబ్‌‌ముఖర్జీ, రెండు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. దీంతో ఆయన వద్దకు తిరస్కరణకు గురైన క్షమాభిక్ష పిటిషన్ల సంఖ్య 30కి చేరింది. ఈ రెండు పిటిషన్లపై రాష్ట్రపతి ప్రణబ్‌ మే‌లో నిర్ణయం తీసుకున్నారు. అందులో ఒకటి ఐదేళ్ల కిందట మైనర్ బాలికపై ఇండోర్‌లో ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి చంపేశారు. ఆ కేసులో న్యాయస్థానం నిందితులకు మరణశిక్ష విధించింది.

 

మరొకటి పుణెలో ఓ క్యాబ్‌‌డ్రైవర్‌, తన ఫ్రెండ్‌తో కలిసి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెని దారుణంగా హత్య
చేశాడు. ఈ కేసులో కూడా నిందితులకు ఉరిశిక్ష విధించింది కోర్టు. ఈ రెండు కేసులూ అత్యంత అమానవీయ స్థితిలో
చోటుచేసుకున్న నేపథ్యంలో వాళ్లకి క్షమాభిక్ష పెట్టకూడదని రాష్ట్రపతి నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రపతిగా ప్రణబ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబై దాడులకు సంబంధించి అజ్మల్‌ కసబ్‌, అఫ్జల్‌గురు, యాకుబ్‌ మీనన్‌ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలైన విషయం తెల్సిందే!

 

 
 
 
Related News

JournalistDiary