World / Health
‘మాంసం’ ఆరోగ్యానికి హానికరం?
454 days ago

అవును.. కొద్దిరోజుల్లో మాంసం ప్యాకెట్ల మీద ఈ తరహా హెచ్చరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీనికి సైంటిస్టులు చెప్పిన కారణాలు ఊతమిస్తున్నాయి. స్మోకింగ్ కంటే మాంసం తినడమే యమడేంజర్ అని తేల్చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ముఖ్యంగా ఈ లిస్ట్‌లో పోర్క్, దానితో చేసిన ఇతర స్నా్క్స్, ప్రొసెస్డ్ మీట్ క్యాన్సర్ కారకాలు‌గా తేల్చింది డబ్ల్యూ‌హెచ్‌ఓ. వీటి తర్వాత రెడ్ మీట్ తింటే మాత్రం ప్రమాదస్థాయి కొద్దిగా తక్కువగా ఉందని తేల్చింది. సిగరెట్లు, ఆల్కహాల్, ఆస్ బెస్టాస్ వాడకం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన పది దేశాల సైంటిస్ట్‌ల సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరమని లేబుల్ వేసిన మాదిరిగానే,  రెడ్ మీట్ ప్యాకెట్ల మీద, మాంసం ప్యాకెట్ల మీద కూడా అదేమాదిరిగా స్టిక్కర్లు వేయాలని సైంటిస్టుల సమావేశం సూచించింది.

ఆహారంలో బీఫ్, పోర్క్, ల్యాంబ్, పోర్క్, తీసుకోవడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు, జింక్, ఐరన్ లాంటి ఖనిజాలు లభిస్తాయని, రెడ్ మీట్ అతిగా వాడటం వల్ల  బౌల్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముందనే రుజువులు కూడా ఉన్నాయనీ అంటున్నారు. వీటిలో అధికంగా ఉండే కొవ్వు, కాన్‌సంట్రేటెడ్ కలర్స్ వాడకం వల్ల బౌల్ లైనింగ్ దెబ్బ తినే ప్రమాదం ఉందంటున్నారు. టేస్ట్ కోసం ఆహారంలో కలిపే సాల్ట్‌, హాట్ డాగ్స్, సాసేజెస్,  బర్గర్ల వల్ల  కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ తెలిపింది. అయితే ఇండియా‌లో అమ్మే మాంసం, ఫ్రోజెన్ ఫుడ్స్‌లో ఏ మేరకు ఈ క్యాన్సర్ కారకాలున్నాయో  ఇంకా తెలియాల్సి ఉందట.

 
 
 
Related News

JournalistDiary