AP / crime
ప్రొఫెసర్‌ లక్ష్మికి బెయిల్ రావడం వెనుక..
310 days ago

పీజీ మెడికల్ స్టూడెంట్ సంధ్యారాణి సూసైడ్ కేసులో రిమాండ్‌ ఖైదీగావున్న గుంటూరు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌ లక్ష్మికి ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. రూ.10 వేల పూచికత్తుపై ఇరువురు జామీను ఇవ్వాలని, అలాగే ప్రొఫెసర్‌ లక్ష్మి పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని గుంటూరు మూడో అదనపు జిల్లా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంధ్యారాణి ఆత్మహత్య కేసులో గత నెల 13న ప్రొఫెసర్‌ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 14న కోర్టులో హాజరు పరిచారు.

కోర్టు ఆమెని జిల్లా జైలుకు పంపింది. ఈ క్రమంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ పలుమార్లు ప్రయత్నించారు. దర్యాప్తు పూర్తి కాలేదని, సంధ్యారాణి డైరీని చేతిరాత నిపుణులకు పంపగా రిపోర్టురావాల్సి ఉందని పోలీసులు చెప్పడంతో గత నెలలో ఆ పిటిషనను కొట్టేసింది.  కేసు దర్యాప్తు పూర్తయిందని చార్జిషీటు కూడా దాఖలు చేశారని పిటిషన్ తరపు లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary