India / Entertainment
బ్యాంకాక్ బీచ్‌లో పూరీ ఏం చేస్తాడంటే..
91 days ago

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ని సిట్ విచారించిన తర్వాత ఆయన తొలిసారి ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ
ఇచ్చాడు. డ్రగ్స్  కేసు గురించి ఏమాత్రం ప్రస్తావించకుండా, బ్యాంకాక్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టాడు.
బ్యాంకాక్ అనగానే చాలామంది మనసులో వచ్చేది సెక్స్, మసాజ్ తప్ప ఏమీ గుర్తు రాదన్నాడు. అందరికీ అక్కడికి వెళ్లాలని, ఎంజాయ్ చేయాలని వుంటుందని, తాను షూటింగ్ నిమిత్తం అక్కడి వెళ్తే ఎంజాయ్ చేస్తున్నానని భావిస్తారని అన్నాడు.

 

అక్కడున్న ఓ బీచ్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటానని, స్టోరీలు డెవలప్ చేస్తానంటూ మనసులోని మాటను వెల్లడించాడు పూరీ. అక్కడ మిగతా పనుల్లో నిమగ్నమైతే స్ర్కిప్ట్ వర్క్ చేయలేనని అన్నాడు. మసాజ్‌లు తనకు ఇష్టమేనని, తాను చేయించుకుంటానని, రోజూ చేయించుకుంటే వళ్లంతా నొప్పులొస్తాయని తెలిపాడు. 15 ఏళ్లగా తనకు ఒక మహిళ మసాజ్ చేస్తుందని, 55 ఏళ్లున్న ఆమె పేరు పాంగ్సీ అని, తన భార్య, పిల్లలతో ఆమె క్లోజ్ వుంటారని తెలియజేశాడు. 

 

Read Also

 
Related News
JournalistDiary