India / General
మోదీ డిగ్రీపై రచ్చరచ్చ
194 days ago

ప్రధాని మోదీ బ్యాచులర్ డిగ్రీ ఏమిటో వివరాలు తెలియాలని కోరుతూ ఆర్టీఏ చట్టం కింద దరఖాస్తును ఢిల్లీ యూనివర్సిటీ అధికారి ఒకరు తోసిపుచ్చడం వివాదాస్పదమైంది. మీనాక్షి సహాయ్ అనే ఈ అధికారిని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ తప్పుబడుతూ 25 వేల జరిమానా విధించింది. ఈ దరఖాస్తును తిరస్కరించడం తనకు పెన్నీయే(చిన్న నాణెమే) గొప్ప, పౌండ్ (పెద్దనోటు) దండగ అనే నానుడిని గుర్తుకు తెస్తోందని కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యులు అన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ పొందిన డిగ్రీ ఏమిటంటూ మహ్మద్ ఇర్షాద్ అనే లాయర్ ఆర్టీఐ చట్టం కింద ఢిల్లీ యూనివర్సిటీకి లేఖ రాశారు. ఐతే, యూనివర్సిటీ రిజిస్ర్టార్ ను ఉద్దేశించి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ మార్క్ లేదన్న కారణంపై దీన్ని తిరస్కరించడంతో ఇర్షాద్ సీఐసీకి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించి సీఐసీ, మీనాక్షి సహాయ్ నుంచి 25 వేలను జరిమానాగా రికవరీ చేయాలని ఆదేశించారు. కేవలం పది రూపాయలకు విలువైన పోస్టల్ ఆర్డర్‌పై వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన వివాదాన్ని వినడమంటే ఇదేనేమో! 

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary