India / Politics
మా మోదీ వేశారు.. మీ రాహుల్ వేస్తారా..?
218 days ago

తాత్కాలిక శెలవుపై వెకేషన్‌కి వెళ్లిన కాంగ్రెస్ ప్రిన్స్ రాహుల్‌గాంధీ మళ్లీ రాజకీయ స్రవంతిలోకి వచ్చేశారు. మోదీ మీద మళ్ళీ సీరియస్‌గా సెటైర్లు కూడా మొదలుపెట్టేశారు. అమ్మను కలవడం కోసం యోగా సెషన్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నానన్న మోదీని ఎద్దేవా చేశారు. 

అసలు ఆయనకు యోగా ఎంతవరకు వచ్చు అన్నదే సందేహమని, మోదీ ఎప్పుడైనా పద్మాసనం వేసినట్లు చూశారా.. అంటూ విమర్శించారు. తన యోగా ట్యూటర్ చెప్పిన మాట ప్రకారం ప్రతిరోజూ యోగా చేసేవారికి మాత్రమే పద్మాసనం సాధ్యమవుతుందని, ఆలెక్కన మోదీ పద్మాసనం వేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని రాహుల్ ప్రశ్నించారు.

వెంటనే స్పందించిన కమలనాధులు రాహుల్ ఒక పార్ట్‌టైమ్ పొలిటీషియన్ మాత్రమేనని, ఆయన చెప్పే మాటలకు అర్థాలే లేవని తిప్పికొట్టారు. బీజేపీ గతంలో యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సామూహికయోగ కార్యక్రమంలో మోదీ వేసిన పద్మాసనం ఫోటోను బయటకు తీశారు. యోగా గురించి మాట్లాడే అర్హత రాహుల్‌కి ఎక్కడ అంటూ నిలదీశారు కూడా. 

 
 
Related News