AP and TS / Entertainment
రాజమౌళి - మహేష్‌బాబు.. హిస్టారికల్ మూవీ?
9 days ago

రుద్రమదేవి, శాతకర్ణి చిత్రాల తర్వాత బాహుబలి బ్లాక్ బస్టర్ అయ్యాక పీరియాడిక్ - హిస్టారికల్‌లపై దర్శకులకు, స్టార్స్‌కు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. చిరంజీవి కూడా సైరాకు రెడీ అయిన ఈ ట్రెండ్‌లో ఆడియన్స్ థియేటర్లో మూవీ చూడాలంటే సమ్ థింగ్ స్పెషల్ ఉండాల్సిందే. బాహుబలి తర్వాత రాజమౌళి మళ్ళీ అలాంటి భారీ సినిమా చేయడానికి కొంత బ్రేక్ తీసుకోవడం గ్యారంటీ. ఈలోగా ఒకట్రెండు రెగ్యులర్ మూవీస్ చేసి మళ్ళీ ఓ విజువల్ గ్రాండియర్‌కు రెడీ అయ్యే ఛాన్స్ ఉంది.

మహేష్ - రాజమౌళి కాంబోలో చిత్రం ఎప్పట్నుండో అనుకుంటున్నా అది హిస్టారికల్ అయితే బావుంటుందని సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ అన్నట్లు సమాచారం. చారిత్రక ఛత్రపతి శివాజీ చిత్రాన్ని నటరత్న ఎన్టీఆర్, కృష్ణ ప్లాన్ చేసినా సాధ్య పడలేదు. ఈలోటు మహేష్ తీరిస్తే బావుంటుందని గోపాలకృష్ణ అంటున్నారు. రొటీన్, రెగ్యులర్ సినిమాలను ఆడియన్స్ తిప్పికొడుతున్న ఈ జనరేషన్‌లో వీరిద్దరి ప్రాజెక్ట్ (నిర్మాత కెఎల్ నారాయణ సినిమాకు ఇద్దరి కమిట్మెంట్ ఉంది) ఇదే అయితే బాక్సాఫీస్ బద్దలవుతుంది అంటున్నారు ఫాన్స్.

 

Read Also

 
Related News
JournalistDiary