AP and TS / Politics
ఖైదీపై జక్కన్న ఏమన్నాడు?
257 days ago

ఖైదీ నెంబర్ 150 సినిమాపై జక్కన్న తన ఒపీనియన్‌ని బయటపెట్టాడు. బాస్ ఈజ్ బ్యాక్.. పదేళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ వెనక్కి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే ప్రొడ్యూసర్‌గా చరణ్.. రికార్డు బ్రేకింగ్ సినిమాతో కెరీర్ ప్రారంభించావని రాజమౌళి రాసుకొచ్చాడు. డైరెక్టర్ వినయ్ కుమ్మేశాడని, తను తప్పితే ఈ మెగా ప్రాజెక్టుని ఎవరూ అంతలా చేయలేరని జక్కన్న మరో ట్వీట్‌లో పొగిడేశాడు. 

మరో డైనమిక్ డైరెక్టర్ హరీష్‌శంకర్ కూడా మెగా మూవీపై పూలజల్లు కురిపించేశాడు. సినిమాల్లోకి తిరిగొచ్చిన బిగ్‌బాస్ మరిన్ని హిట్లతో మరిన్ని సంవత్సరాలు ఫ్యాన్స్‌ని అలరిస్తారని హరీష్ ట్వీట్ చేశాడు. ఐతే, మెగా ఫ్యామిలీపై ఎప్పటికప్పుడు సెటైర్లు వేసే కొన్ని ట్విట్టర్ ఖాతాలు మాత్రం ఇంకా మేలుకోలేదు.

 

Read Also

 
 
Related News
JournalistDiary