India / Politics
ఒకే వేదికపై ఇద్దరు సూపర్ స్టార్స్!
68 days ago

రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్న తమిళనాట.. మరో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఇద్దరు సౌతిండియన్ సినిమా ఐకాన్స్ రజినీకాంత్, కమల్ హాసన్ ఒకే వేదికపై మెరిశారు. డీఎంకే పార్టీ మౌత్ పీస్.. అధికార పత్రిక.. మురసోలి ప్లాటినం జూబిలీ వేడుకల్లో ఈ దృశ్యం ఆవిష్కారమైంది.

అతిరధ మహారథులెందరో విచ్చేసినప్పటికీ.. వీరిద్దరూ మాత్రమే అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కాకపోతే.. కమల్ హాసన్ వేదిక మీద స్టాలిన్ పక్కనే కూర్చుంటే..  మాత్రం ప్రేక్షకుల మొదటి వరుసలో సెటిలయ్యారు. రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తల నేపథ్యం.. రజనీ రాజకీయ అవగాహనపై కమల్ చేసిన కామెంట్లు.. కలిపి.. వీరిద్దరి కాంబోకు ప్రాధాన్యతను పెంచేశాయి. అనారోగ్యం కారణంగా డీఎంకే చీఫ్ కరుణానిధి, కుటుంబ కలహాల వల్ల ఆయన కొడుకు అళగిరి హాజరు కాకపోయినా.. మరో కొడుకు, ప్రతిపక్ష నేత స్టాలిన్ ఈ రెండురోజుల కార్యక్రమాన్ని అట్టహాసంగా నడిపిస్తున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary