India / Politics
రజనీ ఎంట్రీకి డేట్ ఫిక్స్
66 days ago


సౌత్ సూపర్‌‌స్టార్‌ రజనీకాంత్‌ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ కన్య్ఫూజన్. కొన్నిరోజులుగా తమిళనాట జరుగుతున్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా పార్టీ ప్రకటనకి డేట్ ఓకే అయ్యిందంటూ ప్రచారం సాగుతోంది. రజినీకాంత్ పుట్టిన రోజు అంటే డిసెంబర్‌ 12న కొత్త పార్టీ ప్రకటించే ఛాన్స్ వుందన్నది దాని సారాంశం. పార్టీ పేరు, జెండా, ఎజెండాపై వాటిపై ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో రజినీకాంత్ టీమ్.. బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీని ఆశ్రయించడం ఇవన్నీ జరిగిపోయాయి. ప్రస్తుతమున్న పరిస్థితులు రజినీ రాజకీయ రంగ ప్రవేశానికి ఎంతమేరా కలిసొస్తుంది? లేదా అన్నది ఈ ఏజెన్సీ స్టడీ చేసి సెప్టెంబర్ నాటికి రిపోర్ట్ ఇవ్వనుందని ఇన్‌సైడ్ సమాచారం. ఈలోగా ‘కాలా’ చిత్రీకరణ ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట ఈ హీరో. మొత్తానికి నవంబర్‌లోపు ‘కాలా’ చిత్రానికి కొబ్బరికాయ కొట్టేసి, ఏజెన్సీ రిపోర్ట్‌ని బట్టి డిసెంబర్‌లో ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు రజినీ క్లోజ్‌ఫ్రెండ్స్ చెబుతున్నమాట.

 
 
Related News