World / Entertainment
రోబో2 రైట్స్: తెలుగు రాష్ర్టాల్లో న్యూరికార్డ్
70 days ago

రజనీకాంత్- అక్షయ్‌కుమార్- ఎమీ‌జాక్సన్ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ రోబో2. శంకర్ డైరెక్షన్‌లో రెడీ అవుతున్న ఈ చిత్రం.. ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయిందని సమాచారం. రజనీకాంత్- శంకర్ కాంబోపై భారీ అంచనాలు వుండడంతో ఇప్పటికే చాలా ఏరియాలు అమ్ముడుపోయాయి. ఇక తెలుగు రాష్ర్టాల విషయానికొస్తే ఇక్కడి డిస్టిబ్యూషన్ రైట్స్‌ని గ్లోబల్ సినిమాస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్ హెడ్ రాజుమహాలింగం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

ఐతే ఎంతకు  వెళ్లిందనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే భారీగా చెల్లించినట్టు ఇన్‌సైడ్ సమాచారం. రజనీకాంత్ నటించిన ‘రోబో’ అప్పుట్లో రూ.32 కోట్లకు వెళ్లిన విషయం తెల్సిందే! ఇక హిందీ శాటిలైట్ రైట్స్ జీ గ్రూప్ 110 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. ఒక ప్రాంతీయ సినిమా ఈ రేంజ్‌లో శాటిలైట్ రైట్స్ వెళ్లడం ఇదే ఫస్ట్‌టైమ్. ఈ లెక్కన చూస్తే బాహుబలిని.. రోబో2 అధిగమించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు. 

 

Read Also

 
Related News
JournalistDiary