India / Entertainment
ట్వీట్లతో కుమ్మేసిన వర్మ
74 days ago

గౌతమీపుత్ర శాతకర్ణి మూవీపై వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఈ ఫిల్మ్ ఘన విజయం సాధించడంపై బాలకృష్ణను ఆకాశానికెత్తేశాడు వర్మ. అరువు తెచ్చుకున్న కథలతోకాకుండా  తెలుగు సినీపరిశ్రమ ఖ్యాతిని తగ్గించకుండా ఒరిజినల్ స్టోరీతో మన ఖ్యాతిని వ్యాపింపజేసిన బాలయ్య, క్రిష్‌లకు శాల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు.

బాలకృష్ణ వందో సినిమా చలనచిత్ర రంగంలో 150 రెట్లు మెగా రికార్డ్ అంటూ రాసుకొచ్చాడు. బాహుబలితో మొదలైన టాలీవుడ్ హవా, శాతకర్ణితో మరింత రెట్టింపు అయ్యిందని, ఈ విషయాన్ని మెగా సోదరులు గుర్తించకపోతే.. మరుగుజ్జులుగానే మిగిలిపోతారని సెటైర్లు వేశాడు.

 

 
 
 
Related News

JournalistDiary