World / Health
పేషెంట్లకు బ్లూఫిల్మ్స్..!
469 days ago

శృంగార వీడియోలా తప్పు.. తప్పు.. అనే రోజులు పోయేలా కనిపిస్తున్నాయి. వీటిని రోగుల మీద ప్రయోగించే రోజులు వచ్చేట్టు కనిపిస్తున్నాయి. ఇంటర్ నెట్ లో శృంగార వెబ్ సైట్లు (పోర్న్ సైట్స్) నిషేధిస్తున్నామంటూ కేంద్రం ఆదేశాల ఇచ్చింది. అయితే, దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున నిరసనలు రావడంతో ఎట్టకేలకు వెనక్కితగ్గింది. ఇదిలాఉంటే, తాజాగా ఈ పోర్నోగ్రఫీని చికిత్స కోసం వాడేందుకు డాక్టర్లు సిద్దమవుతున్నారు. అంగస్తంభన సమస్యతో బాధపడేవాళ్లకి చికిత్సలో భాగంగా ఈ పోర్న్ వీడియోలు చూపిస్తారట. ఈ మేరకు రాంచీలోని సైకియాట్రీ & అలైడ్ సైన్సెస్ రాంచీ ఇన్స్టిట్యూట్ (Rinpas) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ పద్దతి కొత్తేమీ కాదని పూర్వంకూడా ఈ తరహా చికిత్స ఉండేదని ఇది జంటలు కోసం ఒక సెక్స్ థెరపీ టెక్నిక్ అని డాక్టర్ అమూల్ రంజన్ సింగ్ చెబుతున్నారు. భారతీయ పురుషుల్లో సెక్స్ సామర్థ్యం గురించి నిర్వహించన ఒక సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.  భారతీయ పురుషుల్లో ప్రతి 10మందిలో ఒకరు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. 1,500 మంది మీద నిర్వహించిన ఈ సర్వేలో 40 ఏళ్ల వయస్సు పైబడ్డ 50 శాతం పురుషులు ఈ సమస్యకు లోనవుతున్నారని లెక్కలు చెబుతున్నాయి.  


 

 
 
 
Related News

JournalistDiary