AP and TS / Entertainment
రెజీనా గ్లామర్ షో ఫ్లాప్
74 days ago

డస్కీ బ్యూటీ రెజీనాకు ‘నక్షత్రం’ రిజల్ట్ ఊహించిన షాక్ తగిలింది. హీరోయిన్‌గా క్రేజ్ లేక ఆఫర్లు తగ్గిపోవడంతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలో వచ్చిన ఆఫర్‌ని ఫుల్‌గా వినియోగించుకోవాలని భావించి కావాల్సినంత గ్లామర్ షో చేసేసింది ఈ బ్యూటీ. దీంతో తన ఫేట్ మారి బిజీ అయిపోతానని స్కెచ్ వేసినా, నక్షత్రం డిజాస్టర్ కావడంతో రెజీనాకి దిమ్మ రిగిపోయింది.

నక్షత్రంలో పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేక కేవలం గ్లామర్ డాల్‌గానే మిగిలిపోయింది రెజీనా. కృష్ణవంశీ మూవీలో హీరోయిన్ గా చేస్తే కెరీర్‌కి బూస్ట్ అవుతుందనుకుంటే, ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యిందట. ఈమె కన్నా మరో హీరోయిన్‌ ప్రగ్యాకే గ్లామర్, యాక్షన్ పరంగా కొన్ని మార్కులైనా పడ్డాయి. దాంతో నక్షత్రం టోటల్‌గా లాస్ అయింది రెజీనానే!

 

Read Also

 
Related News
JournalistDiary