India / Business
వెయ్యి రూపాయలకే 4జీ ఫోన్
256 days ago

రిలయన్స్ జియో నుంచి మరో బ్లాక్ బస్టర్.. మార్చిలోగా విడుదల..? మిగతా మొబైల్ ఫోన్ కంపెనీలన్నీ మూసుకుని పాడుకోవాల్సిందేనంటూ.. ఓ బ్రేకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. 4జీ నెట్ వర్క్ తో ఆల్ ఫ్రీ అంటూ ఆఫర్స్ మీద ఆఫర్స్ ప్రకటిస్తూ దూసుకెళ్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచే నాన్-ఇంటర్నెట్ ఫోన్లు కూడా వచ్చేస్తున్నాయన్నది తాజా వార్త.

ఇప్పుడు జియో వాళ్ళిచ్చే 4 జీ సిమ్  వేసుకునేందుకు వీలు కల్పిస్తూ.. ఫ్రీ వాయిస్ కాల్స్ ని సపోర్ట్ చేసే ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలన్నది లేటెస్ట్ ప్లాన్. వీటి ధర రూ. 999 నుంచి 1500 వరకూ ఉండవచ్చని.. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు కూడా ఉండవచ్చని మీడియాలో కథనాలొచ్చేశాయి. జియో సిమ్ చేతిలో ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ కొనుక్కునే స్తోమత లేనివాళ్లకు ఇదొక గోల్డెన్ ఛాన్స్. జియో వారి చవకైన ఫీచర్ ఫోన్లు కనుక మార్కెట్లోకి వస్తే.. మిగతా హ్యాండ్ సెట్ కంపెనీలన్నిటికీ చావుదెబ్బ ఖాయమన్నది క్లియర్. 


 

Read Also

 
 
Related News
JournalistDiary