AP and TS / General
లక్ష్మీస్ ఎన్టీయార్.. లక్ష్మీపార్వతి రోల్ రోజాకేనా?
9 days ago

రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమాలో రోజాకు ఒక పాత్ర వుంటుందని ప్రకటించారు. ఈ సినిమాలో రోజాకు ఏ పాత్ర ఇస్తారోనంటూ ఆసక్తికరమైన చర్చ ఇప్పటికే మొదలైంది. రోజాకు పాత్ర ఇస్తున్నారంటే ఆ పాత్ర కచ్ఛితంగా లక్ష్మీపార్వతి పాత్రే అయివుంటుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. నిజానికి రోజా స్థాయి పాత్ర ఆ సినిమాలో ఇంకేముంటుందంటూ గెస్ వర్క్‌లు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు వెళ్లిన రాంగోపాల్ వర్మ అక్కడ వైసిపి నేత, ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. లక్ష్మీపార్వతి ఎన్టీయార్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఇతివృత్తమే తన లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమా అంటూ ఆర్జీవీ చెప్పారు.

ఈ విషయంపై రోజా స్పందించారు. తనకు ఇచ్చిన ఆఫర్‌పై ఆమె మాట్లాడుతూ సినిమాలో తనకు సుముచితమైన పాత్ర లభిస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదన్నారు రోజా! ఇదిలావుండగా రాంగోపాల్ వర్మ తీస్తున్న ఈ సినిమాపై ఎన్టీయార్ కుటుంబసభ్యులు అసంతృప్తిగా వున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వారు ఆర్జీవీపై సినిమా తీయవద్దంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ చెప్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకూ ఎన్టీయార్ కుటుంబసభ్యులెవరూ అధికారికంగా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. జూనియర్ ఎన్టీయార్ మాత్రం ఎన్టీయార్ బయోపిక్‌లు ఎవరైనా చేయొచ్చనీ.. తాను తన తాత ఎన్టీయార్ పాత్ర చేయలేనని మాత్రం కామెంట్ చేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary