AP and TS / Entertainment
'రోజాస్ ప్రకాష్‌రాజ్'.. వైరల్ ఫోటో.. వర్మ టేకప్ చేస్తారా?
9 days ago

వర్మ టేకప్ చేసిన 'లక్ష్మీస్ ఎన్టీయార్' మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చీరాగానే.. దాంతోపాటే రూమర్లు, సెటైర్లు బోలెడన్ని! 'లక్ష్మీస్ ఎన్టీయార్'లో లక్ష్మి ఎవరు? ఎన్టీయార్ ఎవరు అంటూ ఎవరికీ వారు లెక్కలేసుకోవడం కనిపిస్తోంది. కానీ.. రోజాకు ఓ మంచి రోల్ ఉంటుందని వర్మ స్వయంగా చెప్పేశారు. మంచి రోల్ అంటే.. ఎన్టీయార్ బయోగ్రఫీలో లక్ష్మి పార్వతి కంటే మించింది లేదు.

ఎక్కువ ఫ్రేమ్స్ లో కనిపించదగ్గ ఫిమేల్ పర్సనాలిటీ ఈ సినిమాలో వెతికినా కనిపించదు. అందుకే.. లక్ష్మిపార్వతిగా రోజా.. అంటూ నెటిజన్లు ఫిక్సయిపోయారు. ఇటు.. ఎన్టీయార్ పాత్రను ప్రకాష్ రాజ్ అయితే బాగా చేస్తారంటూ సజెషన్లు కూడా వచ్చేశాయి. ఇప్పటికే తమిళనాడు పాలిటిక్స్ మీద మణిరత్నం తీసిన 'ఇద్దరు' మూవీలో కరుణానిధి పాత్రలో కనిపించి మెప్పించారు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో ఎన్టీయార్ వేషమేస్తే ప్రకాష్ రాజ్ అతికినట్లు సరిపోతారంటూ కాంప్లిమెంట్స్ పడిపోతున్నాయి. సో.. 'రోజాస్ ప్రకాష్ రాజ్'..! అంటూ ఒక కుక్డ్ ఫోటో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ.. ఈ కాంబోను వర్మ వర్కవుట్ చేస్తారా? ఇప్పటికైతే.. అటువంటి ఆలోచనేదీ లేదని ఆయన క్లారిటీనిచ్చేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary